KDP: గురువారం విజయదశమి సందర్భంగా కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ పూజ నిర్వహించారు. జిల్లా పోలీస్ ఆయుధాగారంలో జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ పూజ చేశారు. దుర్గామాత చిత్రపటానికి చుట్టూ తుపాకులు అలంకరించారు. అనంతరం మోటార్ ట్రాన్స్ పోర్ట్ విభాగంలోని వాహనాలకు పూజ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ప్రకాశ్, డీఎస్పీ సుధాకర్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.