VSP: ఉమ్మడి విశాఖ జిల్లాలో మాజీ సీఎం జగన్మోహన్ రోడ్ షోకు మొదట జాతీయ రహదారిపై అనుమతి నిరాకరించిన పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మంగళవారం అర్ధరాత్రి ప్రత్యామ్నాయ మార్గాన్ని ప్రకటించారు. విశాఖ విమానాశ్రయం నుంచి ప్రారంభమై ఎన్ఏడీ కొత్త రోడ్డు, పెందుర్తి జంక్షన్, సరిపల్లి జంక్షన్ మీదుగా వెళ్లాలని సూచించారు.