కృష్ణా: గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం పెనమలూరు నియోజకవర్గంలో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెనమలూరు మండలం గంగూరు వద్ద నేషనల్ హైవే రోడ్డు పై గాయాలతో పడి ఉన్న వ్యక్తిని శుక్రవారం స్థానికులు గమనించారు. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.