SKLM: ‘సంస్కృతం’ అంశంగా ఆరునెలల స్వల్పకాలిక కోర్సులో ప్రవేశానికి డా. బీ. ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీ దరఖాస్తులను ఆహ్వానిస్తోందని వర్సిటీ రిజిస్ట్రార్ పి. సుజాత బుధవారం తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 17వ తేదీ వరకు స్వీకరించి, 18 నుంచి తరగతులను ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. ఈ కోర్సులోకి ప్రవేశానికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు.