శ్రీకాకుళం: గంజాయి కేసులో ముగ్గురు ముద్దాయిలకు 10 సం.రాలు జైలు శిక్ష, లక్ష రూపాయలు జరిమానా విధించినట్లు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కె.వీ.మహేశ్వర రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బెహరా, త్రినాధరావు, వాసులకు, ఒకటవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి పి.భాస్కరరావు తీర్పును వెల్లడించినట్లు వివరించారు. గంజాయి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.