GNTR: తెనాలిలో కొలువై ఉన్న ‘మహా గణపతి’ వినాయక చవితి పూజలకు సిద్ధమయ్యాడు. తెనాలి-మంగళగిరి మార్గంలో విఎస్ఆర్ & ఎన్వీఆర్ కాలేజీ వద్ద ప్రధాన రహదారి పక్కన గల 60 అడుగుల భారీ మహా గణపతి విగ్రహం తెనాలికే ఐకాన్‌గా గుర్తింపు పొందింది. ప్రతి సంవత్సరం చవితి వేడుకలను నిర్వాహకులు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ సారి కూడా మహా గణపతి విగ్రహానికి నూతన రంగులు దిద్దారు.