NLR: ఉదయగిరి మండలం మాసాయిపేటలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో రెండు రోజులు క్రితం చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్థుల కథనం మేరకు దుండగులు ఆలయంలోని తాళాలు పగులగొట్టి రాగి దీపారాధనలు, వెండి గొడుగు, హుండీ పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. చోరీ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలపడం గమనార్హం.