KRNL: మంత్రాలయంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బోయ పెద్దయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. నాగలదిన్నె రహదారిలో సుంకప్ప తాత దర్గా వద్ద మద్యం అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో సీఐ రామాంజులు, ఎస్సై మల్లికార్జున దాడులు నిర్వహించారు. నిందితుడి వద్ద నుంచి 94 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.