ASR: అనంతగిరి మండలం లుంగాపర్తి పంచాయతీ పరిధి మళ్లీపాడు గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో సరైన తాగునీటి సౌకర్యం లేక సమీపంలోని కొండ ప్రాంతంలో వచ్చే ఊట నీటిని తెచ్చుకొని తమ అవసరాలకు వినియోగించుకోవల్సి వస్తుందని సోమవారం వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించాలని కోరుతున్నారు.