ATP: ఈనెల1వ తేదీన పింఛన్ తీసుకొని వారికి నేడు పంపిణీ చేస్తామని డీఆర్డీఏ పీడీ శైలజ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల పింఛన్ లబ్ధిదారులు సచివాలయానికి వెళ్లి పింఛన్ సొమ్మును తీసుకోవాలని పేర్కొన్నారు. కాగా జిల్లాలో 1న 95.53 శాతం పంపిణీ పూర్తయింది. 2,79,933 మందికి సచివాలయ సిబ్బంది పింఛన్ పంపిణీ చేశారు.