ప్రకాశం: కనిగిరి మండలం తక్కెళ్ళపాడు గ్రామ శివారులో శనివారం ఎస్సై శ్రీరామ్ తన సిబ్బందితో కలిసి కోడిపందాలు ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ. 3,640 నగదుని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా వారి వద్ద నుండి రెండు పందెం కోళ్లను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుచునట్లు తెలిపారు.