SKLM: జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు 2025 జనవరి 03వ తేది శుక్రవారం నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారి శ్రీఎల్.ఎన్.వి.శ్రీధర్ రాజా పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన జారీ చేశారు. 2025 జనవరి 3వ తేది శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గం.లకు స్థాయి సంఘాల సమావేశం ప్రారంభం అవుతాయన్నారు.