ప్రకాశం: ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో సోమవారం ప్రకాశం జిల్లా కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ముఖ్యఅతిథిగా రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు హాజరయ్యారు. అంతకుముందు వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ బలోపేతంపై కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలు, కోటి సంతకాల సేకరణ అంశాలపై వారు చర్చించుకున్నారు.