SKLM: జలుమూరు మండలంలోని నదీ తీర ప్రాంతాలను సీఐ ఎం. శ్రీనివాసరావు, కంచిలి ఎస్సై పారినాయుడు శుక్రవారం పరిశీలించారు. పర్లాం, అందవరం, అచ్యుతాపురం రైతుల ప్రాంతాలను సందర్శించి అక్కడ గ్రామస్తులను అప్రమత్తం చేశారు. వారు మాట్లాడుతూ.. వరద ఉధృతి పెరిగే అవకాశం ఉండడంతో ప్రత్యేకంగా తగు సూచనలు సలహాలు ప్రజలకు అందజేస్తున్నామని వివరించారు.