AKP: ఎరువులు కోసం రైతులు ఆందోళన పడాల్సిన పనిలేదని మునగపాక ఏవో జ్యోత్స్న సోమవారం అన్నారు. మండలానికి రెండు విడతల్లో మొత్తం 570 మెట్రిక్ టన్నుల ఎరువులను ప్రభుత్వం సరఫరా చేసిందన్నారు. ఎరువులు అవసరమైన రైతులు సంబంధిత రైతు సేవా కేంద్రాలకు వెళ్లి అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించి తీసుకోవచ్చునని చెప్పారు. సిఫార్సుల మేరకే ఎరువులు వినియోగించాలన్నారు.