ప్రకాశం: తుఫాను కారణంగా తర్లుపాడు మండలంలో వ్యవసాయ పనులు నిలిచిపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు స్థానిక మహిళా కూలీలు జీవనోపాధి కోసం పక్క మండలాలైన కురిచేడు, దొనకొండల ప్రాంతాలకు రైలు మార్గం ద్వారా వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. అనంతరం మండలంలో పనులు తగ్గినందున వారు పక్క మండలాలపై ఆధారపడవలసి వచ్చిన పరిస్థితిపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. .