ASR: ఇటీవల కాలంలో విద్యార్థులు, యువత డ్రగ్స్ బారిన పడి, జైలు పాలు అవుతూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారని ఈగిల్ టీమ్ ఇన్స్‌స్పెక్టర్ రమేశ్ రుద్ర అన్నారు. సోమవారం పాడేరులోని మదర్ ఒకేషనల్ జూనియర్ కళాశాలను ఈగిల్ టీమ్ ఆధ్వర్యంలో సందర్శించారు. విద్యార్థులతో సమావేశమయ్యారు. గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు.