కృష్ణా: గుడివాడలోని 25వ వార్డు పెద్దఎరుకపాడులో శుక్రవారం ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. శానిటేషన్ ఇంఛార్జ్ రేమల్లి రాణి పర్యవేక్షణలో డ్రైనేజీలపై పెరిగిన గడ్డిని, మురుగును తొలగించారు. చెత్తను రోడ్లపై వేయకుండా సిబ్బందికి ఇవ్వాలని వార్డు ప్రజలను ఆమె కోరారు. ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
Tags :