GDWL: గ్రూప్-1 పరీక్షలను తిరిగి నిర్వహించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం అయిజ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో టీజీపీఎస్సీ విఫలమైనందున సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని అన్నారు. పరీక్షలో అవకతవకలు జరగడం వల్ల అభ్యర్థులు అసంతృప్తిలో ఉన్నారన్నారు.