కోనసీమ: భారత దేశ ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి, రాజ్యసభ సభ్యుడు సనా సతీష్ పార్లమెంట్లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇవాళ ప్రమాణస్వీకారం చేసిన గౌరవ ఉపరాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు. భారత దేశ అభివృద్ధి, ప్రగతి, సుసంపన్నత కోసం కలిసి పనిచేస్తామని తెలిపారు.