ప్రకాశం: కనిగిరి పట్టణంలో శనివారం రాత్రి డీఎస్పీ పి.సాయి ఈశ్వర్ యశ్వంత్ వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. వాహన దారులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో అని వాకబు చేశారు. వాహనాల్లో నిషేధిత వస్తువులు సరఫరా, రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి నడుచుకోవాలని సూచించారు.