శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రయాణించే బెంగళూరు-భువనేశ్వర్ (రైలు నం. 18463/64) ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలుకు 3వ ఏసీ భోగిని అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ జనరల్ మేనేజర్ పరమేశ్వర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రైలు శ్రీకాకుళం రోడ్డు, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం తదితర రైల్వే స్టేషన్లలో ఆగనుంది.