TPT: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 14 జిల్లాల SPలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తిరుపతి SP హర్షవర్ధన్ రాజు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సబ్బురాయుడును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ఇది వరకే ఇక్కడ SPగా పని చేశారు. మరోవైపు హర్షవర్ధన్ రాజు ప్రకాశం జిల్లాకు బదిలీ అయ్యారు. త్వరలో నూతన ఎస్పీలు బాధ్యతలను చేపట్టనున్నారు.