అన్నమయ్య: రామసముద్రం మండలం పెద్దకురపల్లె గ్రామంలో యువకుడిపై కత్తితో దాడి చేసిన కేసులో అరెస్ట్ అయిన నిందితుడిని పోలీసులు ఆదివారం కోర్టుకు తరలించారు. ఘటన జరిగిన వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి నిందితుడిని పట్టుకున్నారు. వైద్యపరీక్షలు పూర్తి చేసిన అనంతరం అతన్ని కోర్టులో హాజరు పరిచారు. నేరస్తులపై ఎటువంటి ఉపేక్ష ఉండదని పోలీసులు తెలియజేశారు.