ATP: స్పీకర్ అయ్యన్న పాత్రుడిని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కలిశారు. తన కుటుంబసభ్యులతో కలిసి సచివాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ పిల్లలను స్పీకర్ ఆప్యాయంగా పలకరించారు. వారితో సరదాగా ముచ్చటించారు. అలాగే ఏం చదువుతున్నారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో ఫొటో దిగారు.