తూ.గో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీకి నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను కలెక్టర్ కీర్తి చేకూరి అభినందించారు. శుక్రవారం సాయంత్రం రాజమండ్రిలో కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని, ఇకపై ప్రజల మధ్య మరింత చురుకుగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.