ప్రకాశం: గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామంలో క్రిస్మస్ సందర్భంగా సౌత్ జోన్ ఇండియా జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ నెల 21, 22వ తేదీల్లో ముండ్లపాడు సెయింట్ జేకబ్స్ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో పోటీలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. పాల్గొనాలనుకునే వారు ఈ నెల 20లోపు పేర్లను నమోదు చేసుకోవాలని, ఎంట్రీ ఫీజు రూ. 500 చెల్లచాలన్నారు.