GNTR: దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో స్వాతంత్య్ర సమరయోధులు, శతాధిక వృద్ధులు సంకా పూర్ణ చంద్ర రావు(106) శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఉప్పు సత్యాగ్రహం, గ్రంథాలయ ఉద్యమాల్లో పాల్గొన్న పూర్ణచంద్రరావుకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. ఇద్దరు కుమారులు మృతి చెందగా, కుమారుడు బలరామకృష్ణమూర్తి, కుమార్తె విజయలక్ష్మిలతో కలిసి ఉంటున్నారు.