TPT: మదనపల్లెకు చెందిన నరసింహులు గత నెల 20వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో ఆయన భార్య విజయలక్ష్మి ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. నర్సింహులను అతని స్నేహితుడు నాగరాజు చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో హతమార్చి అక్కడే గొయ్యి తీసి పూడ్చి పెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మృతదేహాన్ని ఇవాళ వెలికితీసి పోస్ట్ మార్టం నిర్వహిస్తారని సమాచారం.