ELR: మంత్రి నాదేండ్ల మంగళవారం మండవల్లి మండలం మణుగూరులోని కొల్లేరులో ఉన్న పెదయడ్లగాడి వంతెనను పరిశీలించారు. ఉప్పుటేరులో పేరుకుపోయిన గుర్రపు డెక్క, తూడును వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. కొల్లేరు పరిసరాల్లో నివాసం ఉంటున్న ప్రజలను కలిసి, పునరావాస కేంద్రాలకు వెళ్లాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. జిల్లా యంత్రాంగం, పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు.