ATP: అకాల వర్షాలతో జరిగిన పంట నష్టంపై సీఎం చంద్రబాబు నాయుడు క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లు ఆనంద్, శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి తక్షణ నివేదికలు పంపాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.