కోనసీమ: రోజు రోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆలమూరు ఎస్సై జి. నరేష్ సూచించారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. మండలంలోని ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగహన పెంచుకుని, మరికొందరికి అవగాహన కల్పించాలన్నారు. చదువుకున్న వాళ్లు కూడా ఇటీవల సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.