RR: రాజేంద్రనగర్‌లోని ఈవీఎం గోడౌన్‌ను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి సందర్శించారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీల్‌లను పరిశీలించి.. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు ఇతర ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన తీరు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.