AP: తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టనున్నట్లు రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల JAC మరోసారి స్పష్టంచేసింది. ప్రభుత్వం రెండేళ్లుగా తమ సమస్యలను పట్టించుకోవడం లేదని, దీంతో ఈ నెల 13న విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే 15న నిరవధిక సమ్మెకు దిగుతామని పేర్కొంది. ఎస్మా ప్రయోగించినా తమ సమ్మె కొనసాగుతుందని తెలిపింది.