NZB: మోపాల్ మండలం సిర్పూర్లో నిర్వహిస్తున్న టీకాల కార్యక్రమాన్ని శనివారం నిజామాబాద్ డివిజన్ ఆరోగ్య విస్తరణ అధికారి గోవర్ధన్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అర్హులైన వారందరికీ సకాలంలో టీకాలు వేయాలని సూచించారు. డ్యూ లిస్ట్ అందుబాటులో ఉంచుకొని అందరికీ టీకాలు ఇవ్వాలన్నారు. వ్యాక్సిన్ సక్రమంగా భద్రపరచాలని సూచించారు.