ATP: ప్రధాని మోదీ ప్రారంభించిన ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన కార్యక్రమంలో అనంతపురం కలెక్టరేట్ నుంచి వర్చువల్గా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. ఈ పథకం రైతుల సంక్షేమానికి, వ్యవసాయాభివృద్ధికి తోడ్పడనుందని వారు తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ విస్తరణతో జిల్లా “ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్”గా నిలిచిందని పేర్కొన్నారు.