NRPT: పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం ద్వారా జిల్లాలో వ్యవసాయ రంగానికి మహర్దశ రాబోతుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. నారాయణపేట మండలం జాజాపూర్ రైతు వేదికలో నిర్వహించిన పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం ప్రారంభోత్సవంలో ఎంపీ డీకే అరుణతో కలిసి పాల్గొని మాట్లాడారు. రైతులు పండించే పంటల ఉత్పత్తి పెంచడం ప్రధాన లక్ష్యమని చెప్పారు.