BHNG: ఈనెల 28న కల్లుగీత కార్మిక సంఘం నాలుగవ మండల మహాసభలను చౌటుప్పల్లో నిర్వహించనున్నట్లు తుర్కపల్లి మండలాధ్యక్షుడు మారగోని శ్రీరామమూర్తి పేర్కొన్నారు. ఈ సభలను విజయవంతం చేయాలని ఇవాళ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సంబంధిత కరపత్రాలను దత్తాయిపల్లి గ్రామంలో ఆవిష్కరించారు. కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని తమ హక్కులను సాధించుకోవాలని కోరారు.