VSP: విశాఖ కళింగ వీధి, కణితి కాలనీలోని శ్రీశ్రీశ్రీ గణపతి సాయినాథ సహిత అభయ కోదండ రామాలయ ప్రాంగణంలో శనివారం శ్రీ పంచముఖేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ కార్తికేయ, శ్రీ స్వర్ణకర్షణ భైరవ, శ్రీ భువనేశ్వరి దేవి సహిత శ్రీ పంచముఖేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు.