ASR: దేవీపట్నం మండలంలో రైతులు మొక్కజొన్న తోటలు పెంపకంపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. రవిలంక, పోశమ్మగండి, పూడిపల్లి, నాగులాపల్లి గ్రామాల్లో 500 ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు. పెట్టుబడి, ఖర్చులు పోను ఎకరానికి రూ.30వేలు వరకు మిగులుతుందని రైతులు తెలిపారు. ఇక్కడి భూములు మొక్కజొన్న పంటకు చాలా అనుకూలంగా ఉన్నాయని రైతులు తెలిపారు.