PPM: పట్టుచెన్నూరు పంచాయతీ డొంకలవెలగవలస గ్రామానికి వెళ్లే దారి ఇది.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రహదారి వేసేందుకు ఎర్త్ వర్క్ చేయ డంతోపాటు, రాళ్లు వేసి చదును చేశారు. తరువాత బీటీ వేయాల్సి ఉండగా నిధులు విడుదల కాకపోవ డంతో గుత్తేదారు పనులు నిలిపివేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇదే దుస్థితి నెలకొనడంతో ప్రజలు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు.