సత్యసాయి: కదిరి STSN ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్, వృక్షశాస్త్ర విభాగాల్లో రెండు అతిథి అధ్యాపకుల ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా. ఎస్. స్మిత తెలిపారు. పీజీలో 55 శాతం (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం) అర్హతగా ఉండాలని, అభ్యర్థులు సెప్టెంబర్ 3న ఉదయం 10 గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలలో హాజరు కావాలని సూచించారు.