SKLM: జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఉదయం ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి లింక్ వెబ్సైట్లో అర్జీలు నమోదు చేసుకోవచ్చునని ప్రకటనలో తెలిపారు. ఈ వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.