TPT: పోలీసుల అమరవీరుల దినోత్సవం వారోత్సవాలను పురస్కరించుకుని గురువారం ఓజిలిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దొరవారిసత్రం ఎస్సై హాజరై మాట్లాడుతూ.. పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని చెప్పారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని పరిశీలించారు. మండలానికి చెందిన యువత రక్తదానం చేశారు.