ATP: కసాపురం దేవస్థానం EO విజయరాజు, MP అంబికా లక్ష్మీనారాయణను మర్యాదపూర్వకంగా కలిసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎంపీకి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఆయన ఇప్పటికే బస్ షెల్టర్ ఏర్పాటు చేస్తున్నామని, భక్తుల సౌకర్యార్థం నక్షత్రవనం, రహదారులు, వసతి గదుల నిర్మాణానికి దశలవారీగా కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.