సత్యసాయి: ధర్మవరం బిఎస్ఆర్ మున్సిపల్ స్కూల్ మైదానంలో ఈ నెల 27న ఫ్లోర్ బాల్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా ఫ్లోర్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి ప్రసాద్ తెలిపారు. అండర్-12, 17 విభాగాల్లో బాలురు, బాలికలకు పోటీలు జరుగుతాయని, ఎంపికైన క్రీడాకారులు నవంబర్ 2న నరసరావుపేటలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.