AKP: పారిశుధ్యం-పరిశుభ్రతలో కీలక పాత్ర పోషిస్తున్న పలువురు గ్రీన్ అంబాసిడర్లకు అవార్డులు లభించాయి. ఎస్ రాయవరం మండలం గుడివాడకు చెందిన డి. కాసులు, అచ్యుతాపురం మండలం దిబ్బపాలెంకు చెందిన వి. నూకాలమ్మ,అనకాపల్లి మండలం మార్టూరుకు చెందిన ఆర్. అప్పారావు, కే కోటపాడు మండలం చౌడువాడ గ్రామానికి చెందిన ఎం.అప్పారావు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.