VSP: బాలల దినోత్సవం సందర్భంగా విశాఖలోని ఇందిరాగాంధీ జూ పార్క్ లో పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పించారు. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న పిల్లలు ఎలాంటి టికెట్ లేకుండా జూ పార్క్‌ను సందర్శించవచ్చు అని పేర్కొన్నారు. బాలల్లో ప్రకృతి, వన్యప్రాణులపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని జూ అధికారులు తెలిపారు.