CTR: కూటమి ప్రభుత్వం హయాంలో వచ్చే రోజుల్లో చిత్తూరు అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. చిత్తూరులో చదివే యువతకు స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సావిత్రమ్మ కళాశాలలో శుక్రవారం సాయంత్రం క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఎంపికైన యువతకు ఆయన నియామక పత్రాలు పంపిణీ చేశారు.