VSP: కేబీపీ అగ్రహారం పంచాయతీలో డ్రైనేజీ సౌకర్యం లేక మహిళలు వాడుక నీరు బిందెలతో పట్టి దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ గ్రామంలో 10 వీధులు ఉండగా కేవలం 2 వీధులకు మాత్రమే డ్రైనేజీ సౌకర్యం ఉంది. ఈ కారణంగా పలు వీధులలో వాడుక నీరు రోడ్లమీద నిలిచిపోయి దుర్గంధం వెదజల్లుతుంది. సాయంత్రం అయితే దోమల స్వైర విహారం చేస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు.